ఖర్గే పీఎం అంటే.. కాంగ్రెస్ ఒప్పుకుంటదా? మాజీ ప్రధాని దేవెగౌడ ప్రశ్న 

ఖర్గే పీఎం అంటే.. కాంగ్రెస్ ఒప్పుకుంటదా? మాజీ ప్రధాని దేవెగౌడ ప్రశ్న 

న్యూఢిల్లీ: ‘‘ఖర్గేజీ.. మీరు ప్రధాని కావాలనుకుంటున్నారా? దీనికి మీ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుందా?” అని ఖర్గేను మాజీ ప్రధాని దేవెగౌడ ప్రశ్నించారు. జేడీఎస్ ను కొందరు కాంగ్రెస్ లీడర్లు నాశనం చేయాలనుకున్నారని విమర్శించారు. పార్టీని కాపాడుకునేందుకే బీజేపీకి మద్దతు ఇచ్చామని తెలిపారు. 2019లో కుమార స్వామి ప్రభుత్వాన్ని పడగొట్టింది కాంగ్రెస్ నేతలే అని ఫైర్ అయ్యారు.

కర్నాటకకు సీఎంగా తన కొడుకును కాదని.. ఖర్గే పేరును ప్రతిపాదించానని గుర్తు చేశారు. 13 నెలల్లోనే ప్రభుత్వాన్ని పడగొట్టారన్నారు. దీనికి కారణం ఖర్గే కాదని.. కాంగ్రెస్ లీడర్లు అని మండిపడ్డారు. ఖర్గే క్లీన్ పర్సన్ అని కొనియాడారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎప్పుడూ తాను పార్టీలు మారలేదన్నారు. ప్రధాని మోదీ నుంచి తాను ప్రేమ, ఆప్యాయత మాత్రమే పొందానని, ఎలాంటి స్వప్రయోజనం పొందలేదని స్పష్టం చేశారు.